Job Mela : టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఆగస్టు 21న జాబ్ మేళా..!
Job Mela : టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఆగస్టు 21న జాబ్ మేళా..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈనెల 21వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి మల్లయ్య పేర్కొన్నారు.
ఈ నెల 21వ తేదీన పదవ తరగతి, ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నవారు జాబ్ మేళాకు హాజరుకావాలని తెలిపారు. ములుగు రోడ్ లో ఉన్న కార్యాలయం లో 21వ తేదీన ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
జ్యోతి ఎంటర్ప్రైజెస్ లో 15 టెక్నీషియన్ పోస్టులు, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 90 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. టెన్త్ ఇంటర్, డిగ్రీ , ఐటిఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు78933 94393 సంప్రదించవచ్చునని తెలిపారు.
ALSO READ :
హైదరాబాద్ నగరంలో కుండపోత.. జలమయమైన రోడ్లు, కాలనీలు..!
Food poison : పండగపూట విషాదం.. ఫుడ్ పాయిజన్ తో అనాధ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మృతి..!









