TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

కలెక్టర్ సారూ.. జర ఇటు సూడరూ.. చెట్లు ఎందుకు నరికారో..!

కలెక్టర్ సారూ.. జర ఇటు సూడరూ.. చెట్లు ఎందుకు నరికారో..!

చింతపల్లి. మన సాక్షి :

గత ప్రభుత్వం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సుమారు పది లక్షల రూపాయల వరకు వెచ్చించి పల్లె ప్రకృతి వనాల ను ఏర్పాటు చేసింది. అయితే నేడు వాటిపై రక్షణ లేకపోవడంతో కొందరు గ్రామస్తులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామంలో వల్ల ప్రకృతి వనంలో ఏపుగా పెరిగివున్న పచ్చని చెట్లను సోమవారం ఉదయం 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు.

లక్షలాది రూపాయలు వెచ్చించి పెంచినటువంటి చెట్లను నరికి వేయడం ఎంతవరకు సమంజసమని ఆ గ్రామానికి చెందిన కొందరు గ్రామ పెద్దలు పంచాయతీ కార్యదర్శి కి సమాచారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం తో గ్రామాలలో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయల తో పాటు ప్రతి ఇంటి ముందు చెట్లు నాటాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తుంటే మరోపక్క పెరిగిన చెట్లను నరకడం. దుండగలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా నరికి వేసిన చెట్లను బట్టి అర్థం అవుతుందని గ్రామపెద్దలు ఆవేదన వ్యక్తమరుస్తున్నారు.

గ్రామంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ కక్షలతోనే కొందరు వ్యక్తులు ఈ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ త తంగం చూస్తుంటే గ్రామాలలో రాజకీయ రగడ మొదలవుతున్నట్లు కనిపిస్తుంది.

ఏది ఏమైనా గ్రామపంచాయతీ కార్యదర్శి కి కానీ, ఫారెస్ట్ అధికారులకు గాని, జిల్లా అధికారులకు గాని తెలియకుండా చెట్లను నరికి వేయడం నేరం చేసినట్లేనని గ్రామ ప్రజలు, పంచాయతీ కార్యదర్శికి స్థానిక పోలీస్ స్టేషన్లో చెట్లను నరికిన దుండగలపై చట్టరీత్యాచార్యులు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లనట్లు పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు. సోమవారం పంచాయతీ కార్యదర్శి ఓ.సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి ఎస్ఐ. యాదయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : 

Nalgonda : ప్రశ్నిస్తే బ్యాంకు చుట్టూ తిప్పుతాం.. రైతులను హడలెత్తిస్తున్న బ్యాంకు మేనేజర్..!

రాఖీ పండగ నింపిన విషాదం.. జోగిపేటలో డివైడర్ స్థంబాన్ని డికొట్టిన కారు..!

District collector : సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. రైతులను ఇబ్బందులు పెట్టిన తహసిల్దార్ బదిలీ, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగుల సస్పెండ్..!

మరిన్ని వార్తలు