Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

ROR : రేపు తెలంగాణ నూతన ROR చట్టం ముసాయిదా బిల్లుపై చర్చ.. సూచనలు, సలహాలు ఇవ్వండి.. అందరికీ ఆహ్వానం..!

ROR : రేపు తెలంగాణ నూతన ROR చట్టం ముసాయిదా బిల్లుపై చర్చ.. సూచనలు, సలహాలు ఇవ్వండి.. అందరికీ ఆహ్వానం..!

పెద్దపల్లి, మన సాక్షి ప్రతినిధి :

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై జిల్లాలోని రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు ( రిటైర్డ్& సర్వీస్) లతో చర్చా కార్యక్రమాన్ని ఆగస్టు 22న సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ చర్చా కార్యక్రమంలో వచ్చిన సూచనలు, సలహాలు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నివేదించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని మేధావులు, నిపుణులు ఆగస్టు 22న సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై నిర్వహించే చర్చ కార్యక్రమంలో పాల్గొని తమ విలువైన సూచనలు సలహాలు అందజేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

LATEST UPDATE : 

Ponguleti : పర్యాటక ప్రాంతంగా రామదాసు ధ్యాన మందిరం.. మంత్రి పొంగులేటి..!

Nalgonda : ప్రశ్నిస్తే బ్యాంకు చుట్టూ తిప్పుతాం.. రైతులను హడలెత్తిస్తున్న బ్యాంకు మేనేజర్..!

Suryapet : సూర్యాపేటలో మృతదేహాల కలకలం..!

అక్కా.. అర్జెంట్, ఫోన్ చేసుకోవాలి.. జర ఫోన్ ఇవ్వవా.. కట్ చేస్తే..!

దర్జాగా కారులో వచ్చి.. రాత్రికి రాత్రే షాపులన్నీ దోచేశారు, సీసీ పూటేజీలో రికార్డ్..!

మరిన్ని వార్తలు