తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువైద్యంసూర్యాపేట జిల్లా

పేరుకే పెద్ద ఆసుపత్రి.. టెస్టులు చేయరు, మందులు బయట కొనాల్సిందే..!

పేరుకే పెద్ద ఆసుపత్రి.. టెస్టులు చేయరు, మందులు బయట కొనాల్సిందే..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని అన్నారు.

మాసులైన్ పార్టీ నాయకులు హాస్పిటల్ ను సందర్శించి అక్కడున్న సమస్యలను పేషంట్లను , హాస్పిటల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ లో మందుల కొరత ఉన్నదని అదేవిధంగా కిడ్నీ ,గ్యాస్ట్రో ,గుండె న్యూరో డాక్టర్లు లేరని దీనితోపాటు ఎమ్మారై స్కాన్ సౌకర్యం 2డి ఈ కో సౌకర్యం లేదని అన్నారు.

వివిధ పరీక్షలకు కావలసిన ఎక్విరిమెంట్స్ లేక అసంపూర్తిగా ఉన్నదని అదేవిధంగా అన్ని రకాల మందులు లేక డాక్టర్లు బయటికి రాస్తున్నారని అన్నారు. ఇక్కడికి వచ్చే రోగులందరూ పేదలని వీరికి బయట మందులు కొనే ఆర్థిక స్తోమత లేదని తెలిపారు.

ప్రభుత్వం స్పందించి హాస్పిటల్ కి కావాల్సిన వైద్య సిబ్బందిని నియమించి వైద్య పరికరాలను సమకూర్చి అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని అన్నారు. అదేవిధంగా బయట ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై కలెక్టర్ స్పందించి హాస్పటల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు..

ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షురాలు సురం రేణుక, మాస్ లైన్ పట్టణ కార్యదర్శి ఎస్కె గులాం, మాస్ లైన్ డివిజన్ నాయకులు రామోజీ ,వాజిద్ పి డి ఎస్ యు నాయకులు బన్నీ పి ఓ డబ్ల్యూ జిల్లా నాయకులు పద్మ, రమణ, కల్పన , శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

NALGONDA : రుణమాఫీలో కాలయాపన చేస్తే రైతులు తగిన బుద్ధి చెబుతారు.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా..! 

Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!

Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!

Khammam : రైతు సంఘాల ధర్నాలో మంత్రి తుమ్మల.. రుణమాఫీ పై ఏమన్నారంటే..!

మరిన్ని వార్తలు