Govt Hospital : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు.. డిసిహెచ్ వార్నింగ్..!
Govt Hospital : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు.. డిసిహెచ్ వార్నింగ్..!
దేవరకొండ, మనసాక్షి :
దేవరకొండ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి బుధవారం డిసిహెచ్ మాతృ నాయక్ ఆకస్మిక తనకి చేశారు. హాస్పిటల్లోని ఐసీయూ వార్డ్,బ్లడ్ బ్యాంక్, జనరల్ వార్డు,చిన్న పిల్లల వార్డు, డయాలసిస్ వార్డులను పరిశీలించినారు. అనంతరం వైద్యులు, మరియు సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు.
దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్ లో రెగ్యులర్ మత్తు డాక్టర్ లేకపోవడంతో డెలివరీ కోసం వచ్చే గర్భిణి స్త్రీలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.ఆ సమయంలో తప్పని పరిస్థితిలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసి పంపించడం జరుగుతుంది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తాం అన్నారు.
పై అధికారులతో మాట్లాడి మత్తు డాక్టర్ని త్వరగా దేవరకొండ కు తీసుకొస్తాం అని అన్నారు. హాస్పిటల్ ఆవరణలో స్వచ్ఛత,పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వంద పడకల హాస్పిటల్ లో 150 పైగా ఇన్ పేషెంట్లు ఉన్నారు అన్నారు.
సీజనల్ వ్యాధులు డెంగ్యూ,మలేరియా పై ప్రత్యేక దృష్టి పెట్టి,టెస్టులు నిర్వహించి మందులు అందించాలని సూచించారు.24 గంటలు అనస్తేషియా(మత్తు)డాక్టర్ లేక రోగులు చాలా ఇబ్బంది పడుతున్నరు మత్తు డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో
ఉండేటట్లు చర్యలు తీసుకుంటానని అన్నారు.
వైద్య సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని అన్నారు.ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీధితోపాటు ఇంచార్జ్ సూపరిడెంట్ మంగ్త నాయక్, పాల్గొన్నారు.
LATEST NEWS :
మిర్యాలగూడ : ఈ ముఠాలో మామూలోళ్లు కాదు.. ఏకంగా ధర్మల్ పవర్ ప్లాంట్ కే కన్నం..!
Lion : సీసీ పూటేజీలో సింహం కనిపించింది.. భయాందోళనలో ప్రజలు.. (వీడియో)
Viral : ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచరమ్మ డ్యాన్స్.. నేటిజెన్ల కామెంట్స్ చూస్తే.. (వీడియో)
State Leval : రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలకు జడ్పీ స్కూల్ విద్యార్థుల ఎంపిక..!









