Free Health Camp : ఈనెల 20న ఉచిత మెగా వైద్య శిబిరం..!
Free Health Camp : ఈనెల 20న ఉచిత మెగా వైద్య శిబిరం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రంలోని పాత గంజిలో గల యశోద కేర్ హాస్పిటల్ మరియు లైన్స్ క్లబ్ నారాయణపేట వారి ఆధ్వర్యంలో ఈనెల 20 న శుక్రవారం పాత గంజ్ లోగల యశోద కేర్ ఆసుపత్రిలో ఉదయం 10గంటలనుండి సాయంత్రం 4గంటల వరకు మహిళ లకు మరియు యువతుల ఆరోగ్య సమష్యల పై నిర్వహించే ఉచిత మెగా వైద్య శిభిరాన్ని మహిళలు యువతులు సద్వినియోగం చేసువాలని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ హరి నారాయణ్ బట్టడ్, ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు ప్రీతిరెడ్డిలు బుధవారం తెలిపారు.
ఈ ఉచిత వైద్యశిభిరంలో గర్భధారణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, లైంగిక ఆరోగ్య సమస్యలు, ఎండోమెట్రోసిస్ సంబంధిత వ్యాధులకు ఉచిత చికిత్సతో పాటు ల్యాబ్ పరీక్షలు స్కానింగ్ లు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేస్తామనితెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు ఎం జనార్ధన్, రవి గౌడ్, బాలాజీ, కృష్ణ మూర్తి హాస్పిటల్ సిబ్బంది సురేష్, వెంకటేష్, విమల తదితరులు పాల్గొన్నారు









