Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసంగారెడ్డి జిల్లా

E pass : ఈ పాస్ లో నమోదు చేయకుండా ఎరువులు విక్రయిస్తే చర్యలు..!

E pass : ఈ పాస్ లో నమోదు చేయకుండా ఎరువులు విక్రయిస్తే చర్యలు..!

కంగ్టి, మన సాక్షి :

నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడిఏ నూతన్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఫర్టిలైజర్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ వ్యవసాయదారులకు అమ్మిన ఎరువులను ఈపాస్ మిషన్ లో వ్యత్యాసం లేకుండా చూసుకోవాలన్నారు.

ప్రతిదీ రిజిస్టర్ రిజిస్టర్ లో పేర్లను పొందుపరచాలన్నారు. ఎరువులు క్రిమిసంహారక మందులు పక్కరాష్ట్ర కు అమ్మితే చట్టరీ చర్యలు తీసుకుంటామన్నారు. రైతాంగానికి రోజుకు ఐదు బస్తాలు చొప్పున ఇవ్వాలని అన్నారు. ప్రతి ఒక్క డీలర్లు ఓ ఫామ్ మరియు బీసీలు ఆన్లైన్లో తప్పకుండా చేసుకోవాలని అన్నారు.

అదేవిధంగా మండలానికి నూతనంగా వచ్చిన వ్యవసాయ అధికారి వెంకటేశం కు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏవో వెంకటేశం మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.

రైతాంగానికి సూచనలు సలహాలు ఎల్లప్పుడు చరవాణి ద్వారా తెలియజేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ డీలర్లు రమేష్ సెట్, నర్సారెడ్డి, రాజు సెట్, బసవరాజ్ ,శ్రీనివాస్ ,రాజు,పండరి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు