BIG BREAKING : బాలికలతో తప్పుగా ప్రవర్తన.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్..!
BIG BREAKING : బాలికలతో తప్పుగా ప్రవర్తన.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్..!
పెద్దపల్లి, మన సాక్షి ప్రతినిధి :
భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులే పాఠశాలలో బాలికల పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నారు. గురువు అనేది మరచి అందరి ముందే నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ లను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.హెచ్.వి.ఎస్. జనార్దన్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పి.సదానందం (ఇంగ్లీష్ ), అబ్దుల్ ఖాదరీ (బయో సైన్స్) అనే స్కూల్ అసిస్టెంట్లను 6వ తరగతి చదువుతున్న బాలికలతో తప్పుగా ప్రవర్తించిన
కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
LATEST UPDATE :
District collector : మంథని బిల్ కలెక్టర్ సస్పెన్షన్.. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్..!
iphone 16 : ఫ్లిప్ లో ఐఫోన్ 16, రూ.55 వేల లోపే.. అంత తక్కువ ఎలాగో చూడండి..!









