నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి పూడ్చివేత.. పరిశీలించిన మంత్రి ఉత్తమ్..!
నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి పూడ్చివేత.. పరిశీలించిన మంత్రి ఉత్తమ్..!
నడిగూడెం, మన సాక్షి :
పంటలు నష్టపోకుండా సాగర్ ఎడమ కాలువకు రేపు నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మాత్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు పడిన గండ్లకు చేపట్టిన మరమ్మత్తు పనులను కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో మేమందరం కలిసి మంచి ఆలోచనలతో సంపూర్ణంగా పనిచేస్తున్నామని సంపూర్ణంగా పనిచేస్తున్నామని తెలిపారు ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు వరదలకు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టిందని తెలిపారు.
సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడిన 48 గంటల్లో ఎస్టిమేషన్ వేసి నిధులు మంజూరు చేసి తక్కువ సమయంలో మూడు రోజుల్లోనే టెండర్లు పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన గండ్ల పూడ్చవేత మరమ్మత్తు పనులు చేపట్టినట్టు తెలిపారు. కొంత మేరకు నీటిని విడుదల చేసి పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకున్నామని మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు.
గండి పూడ్చివేత పనులలో అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దు అని రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని పంటలు నష్టపోకుండా నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ సిఇ రమేష్ బాబు , ఎస్ ఈ శివ ధర్మ తేజ, ఈఈ రామ కిషోర్, డి ఈ ఈ రఘు, జేఈ సత్యనారాయణ పీసీసీ డెలిగేటి సభ్యులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు నళిని రెడ్డి, నాయకులు
యాతాకుల జ్యోతి మధు బాబు బాణాల కవిత నాగరాజు, బడేటి వెంకటేశ్వర్లు, గుండు శ్రీనివాస్ ఏపూరి తిరుపమ్మ సుధీర్, నాగిరెడ్డి లింగారెడ్డి కిన్నెర నాగయ్య దేవబ త్తిని రమేష్ ప్రసాద్, పాలడుగు ప్రసాద్, వల్లపురెడ్డి సురేందర్ రెడ్డి, రామిని విజయవర్ధన్ రెడ్డి, దున్నా శ్రీనివాస్ మొక్క బిక్షపతి శెట్టి సతీష్ గోసుల రాజేష్ పుట్ట రమేష్ గడ్డం మల్లేష్ యాదవ్ గుజ్జ అంజి కాసాని శివ సోమగాని రవి రేపాల పురుషోత్తం, పల్లపు శీను గుండు లింగరాజ్ గుండు విజయ రామారావు శ్రీరాముల శ్రీను దున్న శ్రీకాంత్, గంటే పంగు విజయ్ మేరీగా శ్రీరామ్ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. ఈనెల 28న పోస్టుల భర్తీకై ఇంటర్వ్యూ..!
-
పిడుగుపాటుకు ఇద్దరు యువతులు మృతి..!
-
Devarakonda : జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. వైద్యులు లేక రోగుల అవస్థలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా నిబంధనలు ఫిక్స్.. ఇక వారికే పెట్టుబడి సహాయం..!
-
Healthy Liver : మురికి మొత్తం శుభ్రం చేయబడుతుంది, కాలేయాన్ని బలోపేతం చేయడానికి ఈ ఆహారం తీసుకోండి..!









