TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

TG News : పేద ప్రజలకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళికలు..!

TG News : పేద ప్రజలకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళికలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పేద ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది.

వాటిలో ఇప్పటికే కొన్ని అమలు చేయగా మరికొన్నింటిని కూడా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్తను తెలియజేశారు. దసరా పండుగ సందర్భంగా మంచి నిర్ణయం తీసుకొని శుభవార్త తెలియజేశారు.

పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించేందుకు గాను ప్రణాళికలను రూపొందిస్తుంది. అందులో భాగంగానే దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ కమిటీలను జిల్లా స్థాయి, నియోజకవర్గస్థాయి, పట్టణ, మండల, వార్డు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కమిటీలను ఏ విధంగా ఏర్పాటు చేయాలనే విషయంపై రెండు రోజుల్లో విధివిధానాలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సూచించారు. ఆయన రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాల వారు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణ మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి గృహాలు మంజూరు చేయించుకోవడంలో వెనుకబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈసారి కేంద్రం నుంచి మంజూరు చేసే గృహాలలో అత్యధిక ఇండ్లను మంజూరు చేయించుకోవాలని అధికారులను ఆదేశించారు.

క్లిక్ చేసి ఇది కూడా చదవండి : 

మరిన్ని వార్తలు