తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపండుగలుయాదాద్రి భువనగిరి జిల్లా

Swarnagiri : స్వర్ణగిరి క్షేత్రంలో కన్నుల పండుగ శ్రీవారి కల్యాణం..!

Swarnagiri : స్వర్ణగిరి క్షేత్రంలో కన్నుల పండుగ శ్రీవారి కల్యాణం..!

యాదాద్రి భువనగిరి :

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. స్వర్ణగిరి క్షేత్రం శ్రీవారి వైభవోత్సవ మండపంలో గురువారం శ్రీ పద్మావతి-గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నవరత్నాల స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి కల్యాణ మహోత్సవాన్ని వేదోక్త ప్రకారం వైభవంగా నిర్వహించారు.

మేళతాళ, మృదంగ, మంగళ ధ్వనుల నడుమ సువాసనలు వెదజల్లే రంగురంగుల పూలమాలలతో తోమాల సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దాదాపు 450 కిలోల బియ్యం ప్రసాదం, పులిహోర, లడ్డూ, వడ, ఇతర రకాల ఆహారాన్ని సృష్టిలో ఉన్న సకల జీవరాశికి ఆహార కొరత లేకుండా అందించారు.

శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని భక్తులు కన్నులపండువగా వీక్షించారు. స్వర్ణగిరి క్షేత్రంలో నిత్యాన్న ప్రసాద వితరణలో భాగంగా 3200 మందికి పైగా అన్నదానం చేశారు.

MOST READ : 

 

మరిన్ని వార్తలు