Hydra : హైడ్రా బాధితులకు అండగా ఉంటా.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ప్రకటన..!
Hydra : హైడ్రా బాధితులకు అండగా ఉంటా.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ప్రకటన..!
సూర్యాపేట, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు హైడ్రా బాధితులందరికి అండగా ఉంటానని మాజీ మంత్రి,స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాధిత 42, 43 వార్డులలో పర్యటించి వారు మాట్లాడారు.
ఎంతో కష్టపడి ఇల్లులు కట్టుకున్న పేదవాళ్ల ఇల్లులు కూలగొట్టడం రేవంత్ రెడ్డికి కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. పేదవాళ్లు రూపాయి రూపాయి వెనకేసుకుని గుడిసెలలో ఉంటూ ఈరోజు వాళ్లు సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు.
పేదవాళ్లు ఇల్లు కూలగొడుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లేనని మళ్లీ అదే ప్రభుత్వం వచ్చి ఇళ్లను వాళ్లే కూలగోడుతున్నారని అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకుని, మున్సిపల్ నల్ల కలెక్షన్లు పెట్టించుకుని, రోడ్లు వేయించుకొని ఒక వీధినే ఏర్పాటు చేసుకున్న వాళ్లను రోడ్డున పడేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారు.
వెయ్యి కోట్ల ప్రజల ఆస్తి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారితో మాట్లాడి మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, బీజేపీ మున్సిపల్ ప్లోర్ లీడర్ పల్స మహాలక్ష్మి మాల్సుర్ గౌడ్,జీడి బిక్షం గండూరి ప్రకాష్, సంజీవ్ నాయక్, అంగిరేకుల నాగార్జున, గాలి సాయి, భాష, జహీర్, గుర్రం సత్యనారాయణ రెడ్డి, వంగాల శ్రీనివాస్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ యాదవ్ జీవన్ రెడ్డి, అనిల్ రెడ్డి, బొమ్మగాని శ్రీనివాస్, మద్ది ఉపేందర్ రెడ్డి దాచాపల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు.
LATEST NEWS:
Miryalaguda : మిర్యాలగూడలో రూ 15 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్..!
CM Revanth Reddy : పేదలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. మెరుగైన వైద్యం కోసం నిర్ణయం..!









