Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండలో నడిరోడ్డుపై చైన్ స్నాచర్ హల్చల్..!
Nalgonda : నల్గొండలో నడిరోడ్డుపై చైన్ స్నాచర్ హల్చల్..!
నల్గొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై ఓ చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు. నడి రోడ్డుపై హల్ చల్ చేస్తూ ఓ మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును చోరీ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల.. ప్రకారం మారుతీ నగర్ కు చెందిన కమలమ్మ శనివారం ముసంపల్లి రోడ్డులో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది.
ఆమె వెనకాలనే కొంత దూరం పాటు గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుంటూ వచ్చి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పోయాడు. వెంటనే ఆమె తేరుకొని అరుపులు, కేకలు వేయగా అప్పటికే దొంగ పారిపోయాడు. అనంతరం ఆమె వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసి పుట్టేజిని పరిశీలిస్తూ విచారణ చేపట్టారు.
LATEST UPDATE :









