BREAKING : నల్గొండ జిల్లాలో కారు బీభత్సం.. బాబాయ్ కొడుకు మృతి..!
BREAKING : నల్గొండ జిల్లాలో కారు బీభత్సం.. బాబాయ్ కొడుకు మృతి..!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లాలో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. బాబాయ్, కొడుకు మృతి చెందారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని కొండమల్లేపల్లి మండలం చెన్నారం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కారు బీభత్సం వల్ల ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. హైదరాబాదు నుంచి చీరాల వైపు వెళ్తున్న కారు స్టేజి వద్ద బుగ్గ తండా వైపు ద్విచక్ర వాహనంపై తన అన్న కొడుకుతో వెళ్తుండగా అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినారు. మృతులకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో భీముడు ( 23), వెంకటేష్ ( 8) మృతులు నేరేడుగోమ్ము మండలం బుగ్గతండా గ్రామానికి చెందినవారుగా బంధువులు గుర్తించినారు. వృత్తులు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వరు కావడంతో ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
LATEST UPDATE :
నకిలీ నక్సల్ హల్చల్.. తుపాకీతో బెదిరించి 35 వేలు వసూలు..!
CM Revanth Reddy : పేదలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. మెరుగైన వైద్యం కోసం నిర్ణయం..!









