Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Hyderabad : మంత్రి ఉత్తమ్ ను పరామర్శించిన పాడి కౌశిక్ రెడ్డి..!

Hyderabad : మంత్రి ఉత్తమ్ ను పరామర్శించిన పాడి కౌశిక్ రెడ్డి..!

మన సాక్షి, హైదరాబాద్ :

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించారు.

కాగా పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లో పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి సోదరుడు. కాగా ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబంలో తీవ్ర విచారం. మా పెదనాన్న పురుషోత్తం రెడ్డి అనారోగ్యంతో మరణించారని పేర్కొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు