Breaking Newsతెలంగాణహైదరాబాద్

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు.. ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..!

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు.. ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..!

హైదరాబాద్, మన సాక్షి :

సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆట పాటలతో ఆనందోత్సహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుతూ.. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

నేటి నుంచి తొమ్మిది రోజులపాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ.. తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదని, ప్రకృతిని ఆరాధిస్తూ తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ పండుగ అని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ అని ఆయన పేర్కొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు