Nalgonda : పేపర్ బాయ్ నుంచి.. డాక్టరేట్..!
Nalgonda : పేపర్ బాయ్ నుంచి.. డాక్టరేట్..!
నల్లగొండ, మన సాక్షి :
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి డాక్టరేట్ సాధించి అందరి మన్ననలు పొందాడు ఆ యువకుడు. నల్లగొండ జిల్లా పెద్ద మూల గ్రామానికి చెందిన చాట్ల ఈదయ్య ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పొందాడు. నల్గొండ జిల్లాలోని పెద్దమూల గ్రామానికి చెందిన చాట్ల ఈదయ్యకు భౌతికశాస్త్రంలో డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
అభివృద్ధికి అందనంత దూరంలో పేద కుటుంబంలో పుట్టిన చాట్ల ఈదయ్యకు ఫిజిక్స్ విభాగంలో “స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్, మాగ్నెటిక్ అండ్, ఐరన్ మాస్బర్ స్టడీ ఆఫ్ వోల్మియం ఐరన్ ఆక్సైడ్ బెస్డ్ మ్యాగ్నెటో ఎలక్ట్రిక్ మల్టీఫెరాలిక్ మెటీరియల్స్” అనే అంశముపై ఉస్మానియా యూనివర్శిటీ జాయింట్ డైరెక్టర్, ఆడిట్ సెల్ డాక్టర్ ఎం. శ్రీనాథ్ రెడ్డి పర్యవేక్షణలో తన పరిశోధనను కొనసాగించి పరిశోధన గ్రంధాన్ని యూనివర్శిటీకి సమర్పించారు.
పరిశోధనను పరిశీలించిన విశ్వవిద్యాలయం ఇటీవల చాట్ల ఈదయ్యకు డాక్టరేట్ ప్రకటించింది. తన పరిశోధనకు సహకరించిన రిటైర్డ్ ప్రొఫెసర్ పి.యాదగిరి రెడ్డి,మహాత్మా గాంధీ యూనివర్సిటీ మాజీ వి.సి ప్రొఫెసర్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, హైద్రాబాద్ సిబిఐటి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. శ్రావణ్ కుమార్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం అధ్యక్షలు డా. వెల్దండి శ్రీధర్ ఈదయ్యను అభినందించారు.
ఈయన నల్లగొండ జిల్లా, చందంపేట మండలం, పెద్దమూల అనే మారుమూల గ్రామంలో చాట్లా రాములు, అయ్యమ్మ దంపతులకు కలిగిన ఐదు మంది సంతానంలో చివరి సంతానంగా జన్మించిన ఈదయ్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రాథమిక విద్యాభ్యాసము నుండి మూడవ తరగతి వరకు స్థానిక నాయుడుపాలెం, హాలియా మండలంలో కొనసాగించాడు.
పాఠశాల విద్య మొదలు డిగ్రీ వరకు మిర్యాలగూడలో కొనసాగించాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించలేని ఈదయ్య విద్యార్థి దశ నుంచే పెపర్ బాయ్ గా, ట్యూటర్, హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తూ బీఈడీ పూర్తి చేసి ఉన్నత విద్య కొరకు ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్ష రాసి ఎంఎస్సీ ఫిజిక్స్ విభాగంలో ఉత్తమమైన ర్యాంకును సాధించి పీజీ పట్టా పొందాడు.
కుటుంబ పోషణ కోసం అధ్యాపక వృత్తినీ చెప్పటి కొనసాగుతున్నారు. జీవితంలో ఎవరికి తలవంచకుండా అనేక ఆటుపోట్లకు ఎదిరించి ఉన్నత స్థానాలకు చేసుకోవాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతూ నేడు పి.హెచ్.డి పట్టాను అందుకోవడంతో తన సహచరి పిరమర్తి మీనా, కూతురు సుష్మ , తనయుడు సోహన్ ప్రిన్స్ లతోపాటు స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
LATEST NEWS :









