Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ ఇక రచ్చ రచ్చే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరనేది లీక్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ ఇక రచ్చ రచ్చే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరనేది లీక్..!
మన సాక్షి, సినిమా :
బిగ్ బాస్ 8 తెలుగు మరింత రసవత్తరంగా సాగనున్నది. ఈ సీజన్ ఇప్పటివరకు అంతా పేలవంగా సాగుతుందని టాక్స్ ఉన్నాయి. కాగా ఇప్పుడిప్పుడే ఈ సీజన్ కొంత సక్సెస్ఫుల్ అవుతుంది.
అయితే ఈ ఐదో వారంలో పూర్తవగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని గత వారంలోనే హోస్ట్ నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే.
వైల్డ్ కార్డు ఎంట్రీస్ బిగ్ బాస్ ఇంట్లోకి వస్తే ఇక రచ్చ రచ్చ కొనసాగనున్నది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గతంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్లే వస్తున్నట్లు ముందే లీక్ అయింది. దాంతో మరింత రసవత్తరంగా సాగనున్నది. బిగ్ బాస్ సీజన్ 6 ఫేమ్ ఆదిరెడ్డి వీడియో రిలీజ్ చేశారు.
దానిలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్లు ఎనిమిది మంది ఉంటారని తెలుస్తోంది. వారిలో మెహబూబు, హరితేజ, నైని పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ శనివారం ఎపిసోడ్ లో ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది.
LATEST UPDATE :
-
Cm Revanth Reddy : రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రూ.500 బోనస్ అందరికీ..!
-
Digital Cards : తెలంగాణలో డిజిటల్ కార్డుల పైలట్ సర్వే ప్రారంభం.. ఈ వివరాలు మీ దగ్గర ఉంచుకోండి..!
-
Nalgonda : పేదలందరికీ ఇండ్లు, రూ.5 లక్షలు అందజేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్..!









