Miryalaguda : గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం.. డిఎల్పీపిఓ విచారణ, రికార్డులు స్వాధీనం..!
Miryalaguda : గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం.. డిఎల్పీపిఓ విచారణ, రికార్డులు స్వాధీనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ పరిధిలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామపంచాయతీలో 15వ ఫైనాన్స్ నిధులు దుర్వినియోగం పై మిర్యాలగూడ డి ఎల్ పి ఓ రాఘవరావు విచారణ చేశారు. గ్రామపంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. గత నెల 23వ తేదీన గ్రామానికి చెందిన యువకుడు ఇరిగి క్రాంతి కుమార్ జిల్లా కలెక్టర్ కు గ్రామపంచాయతీ 15 ఫైనాన్స్ నిధుల విషయంపై దుర్వినియోగం జరిగిందని ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎల్పిఓ రాఘవరావు గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
గ్రామపంచాయతీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది జీవితాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 15వ ఫైనాన్స్ నిధులు ఏం చేశారు..? ఏ విధంగా డ్రా చేశారనే అంశాలపై విచారణ చేపట్టారు. పూర్తి నివేదిక జిల్లా అధికారులకు అందజేయనున్నట్లు డి ఎల్ పి ఓ పేర్కొన్నారు.
గ్రామ యువకులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కు గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేయడం వల్లనే అధికారులు విచారణ చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఎంబిలు లేకుండానే రెండు లక్షల పైగా నిధులు డ్రా చేశారని వారు ఆరోపించారు.
విచారణ సందర్భంగా డిఎల్పిఓ వెంట పంచాయతీ కార్యదర్శి జాఫర్, టైపిస్టు గులాం అలీ, ఠాగూర్ రమేష్, అంబటి వేణు, సింగం సతీష్ , యానక బాలకృష్ణ , మల్లయ్య పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
MOST READ :
-
Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..!
-
Paddy : వరిలో నూతన వంగడం, 45 రోజులకే పొట్ట దశకు.. పరిశీలించిన శాస్త్రవేత్తలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం, డబ్బులు పడేది అప్పుడే..!
-
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలాఖరు లోపు వారికే ఇందిరమ్మ ఇండ్లు..!









