TOP STORIESBreaking Newsజాతీయం

Viral Video : పీహెచ్డీ చేస్తూ చికెన్ పకోడీ అమ్మకం.. వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ఏం చేశారంటే..!

Viral Video : పీహెచ్డీ చేస్తూ చికెన్ పకోడీ అమ్మకం.. వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ఏం చేశారంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

కొంతమంది తాము ఎంత చదివినా.. ఎంత సంపాదించినా.. ఏమాత్రం పొంగి పోరు. అలాంటివారు సమాజంలో ఎక్కడో ఒకచోట ఉంటారు. తాను చేసే వృత్తిపై గౌరవంగా ఉండడంతో పాటు ఏ స్థాయిలో ఉన్నా కూడా వృత్తిని మర్చిపోరు అని ఓ యువకుడు నిరూపించాడు.

చెన్నైలో ఓ యువకుడు పీహెచ్డీ చేస్తూనే చికెన్ పకోడీ అమ్ముతున్న వీడియో వైరల్ గా మారింది. ఆ విద్యార్థి పై ఓ విదేశీయుడు చేసిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. యూనిక్ ఇండియా అంటూ ఆనంద్ మహేంద్ర ఆ యువకుడిని అభినందించాడు.

తాను చికెన్ పకోడీ చేయడంతో పాటు ఆ కుర్రాడు రీసెర్చ్ చేసే పేపర్లను గర్వంగా చూపించాడు. ఆనంద్ మహేంద్ర తన ఎక్స్ ఖాతాలో ఆ యువకుడి వీడియోను షేర్ చేయడం వల్ల నెట్టింట్లో వైరల్ గా మారింది.

MOST READ : 

 

మరిన్ని వార్తలు