Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ (వీడియో)
Miryalaguda : సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ (వీడియో)
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని చైతన్య నగర్ లో వార్డు కౌన్సిలర్ శాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే బిఎల్ఆర్ మహిళలతో కలిసి ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహిళలు ఆట పాటలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్న మహిళలకు స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొదిల శ్రీనివాస్, శంకర్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.
Video
మిర్యాలగూడలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ శాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి.. pic.twitter.com/Vzt7rznVF2
— Mana Sakshi (@ManaSakshiNews) October 11, 2024









