TOP STORIESBreaking News

Cm Revanth : సర్పంచి ఎన్నికలు అప్పుడే.. రేవంత్ సంచలన ప్రకటన..!

Cm Revanth : సర్పంచి ఎన్నికలు అప్పుడే.. రేవంత్ సంచలన ప్రకటన..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో చెప్పినట్లుగానే కుల గణన ఎస్సీ వర్గీకరణ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు.

అందుకోసం ఏకసభ్య న్యాయ కమిషన్ పేరుతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ఈ రెండు నెలల పాటు సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు లేవు.

తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించనున్నారు. బీసీ కమిషన్ కు తక్షణమే అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 60 రోజులలో సర్వే పూర్తి చేయాలని, డిసెంబర్ 9వ తేదీ లోగా నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆ సర్వే పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

MOST READ :

మరిన్ని వార్తలు