Pds Rice : పీడిఎస్ బియ్యం భారీగా పట్టివేత.. క్రిమినల్ కేసు నమోదు..!
Pds Rice : పీడిఎస్ బియ్యం భారీగా పట్టివేత.. క్రిమినల్ కేసు నమోదు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు భారీగా పిడిఎస్ బియ్యం పట్టుకున్నారు. పిడిఎస్ బియ్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. వివరాల ప్రకారం..
మిర్యాలగూడ పట్టణంలోని బంగారిగడ్డ, భాగ్యనగర్ కాలనీ నందు పోలీస్ పెట్రోలింగ్ వాహనం పెట్రోలింగ్ చేస్తుండగా, త్రిపురారం మండలం రూపుల తండాకు చెందిన పాతులోత్ బాలు తన మోటారుసైకిల్ నెంబర్ TS 05ES 8826 పై రెండు బస్తాల పిడిఎస్ బియ్యాన్ని తీసుకెళ్తుండగా పట్టుబడు చేసినట్లు మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున తెలిపారు.
విచారించగా ఇట్టి వ్యక్తి గత కొంత కాలం నుండి రామచంద్ర గూడెం లో ఒక రూం నీ కిరాయికి తీసుకొని చుట్టుపక్కల ప్రాంతాలైన బంగారిగడ్డ, రామచంద్ర గూడెం, తాళ్లగడ్డ ఏరియాలో గల తెల్ల రేషన్ కార్డుదారుల వద్ద నుండి పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి సేకరిస్తున్నట్లు తేలింది.
అట్టి పీడీఎస్ బియ్యాన్ని తన మోటారు సైకిల్ పై తీసుకొని వెళ్లి అట్టి గదిలో నిలువచేసి అక్కడ నుండి ఇతర ప్రాంతాలకు అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తూ అక్రమంగా డబ్బులూ సంపాదిస్తున్నడని తెలిసినది.
ఇంట్లో నిల్వ ఉన్న పిడిఎస్ బియ్యాన్ని మిర్యాలగూడ సివిల్ సప్లై అధికారి అయిన నాయబ్ తాసిల్దర్ తన సిబ్బందితో వచ్చి పంచనామ నిర్వహించి అట్టి (74) బస్తాలను ఒక్కొకటి అందాజ 50 కేజీ లు స్వాధీన పర్చుకోనైనది.
అట్టి వ్యక్తిపై మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేస్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున తెలిపారు.
LATEST UPDATE :









