TG News : కొండ సురేఖ వ్యాఖ్యలపై కోర్టు సీరియస్..!
TG News : కొండ సురేఖ వ్యాఖ్యలపై కోర్టు సీరియస్..!
మన సాక్షి, హైదరాబాద్ :
కొండా సురేఖ తనపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్ 100 కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ గా పరిగణించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కోర్టు మండిపడింది.
భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ పై చేయవద్దని కొండ సురేఖను కోర్టు ఆదేశించింది. ఆమె వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, వెబ్సైట్లు , అన్ని సోషల్ మీడియా లలో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని, ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు వీడియో లు పబ్లిక్ డిమాండ్ లో ఉండవద్దని కోరుతూ తెలిపింది.
MOST READ
-
KTR : ఏం.. పీక్కుంటారో పీక్కోండి.. నీ బాంబులకు భయపడలేదు..!
-
Diwali : దీపావళి పండుగ ఎప్పుడు..? ఎన్ని రోజులు సెలవులు..!
-
TG News : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్దమైందా..?
-
BREAKING : ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి మోసం.. కోట్ల రూపాయలతో జెండా ఎత్తిన సంస్థ..!
-
Miryalaguda : పేగు బంధం మరిచి.. భూమికోసం, సొంత అన్ననే..!









