Suryapet : లారీని ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్.. బయటపడిన అక్రమ బండారం..!
Suryapet : లారీని ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్.. బయటపడిన అక్రమ బండారం..!
అర్వపల్లి, మన సాక్షి :
డీసీఎం వ్యాన్ అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దాంతో దేశంలో తరలిస్తున్న అక్రమ దండ బయటపడింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
ఎలాంటి అనుమతి పత్రాలు లేని పశువులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అర్వపల్లి ఎస్సై సిహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాల..
ప్రకారం, శ్రీకాకుళం జిల్లా నుండి 56 పశువులు 40 ఆవులు, 16 కో డెలు డీసీఎం లోడ్ చేసుకొని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో 365 నేషనల్ రహదారి పై తెల్లవారుజామున అర్వపల్లి చౌరస్తాలో ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుండి బలంగా ఢీకొనడంతో లారీకి డీసీఎంకు మధ్యన డ్రైవర్ కేతవత్ కళ్యాణ్ ఇరుక్కున్నారు.
పెట్రోలింగ్ చేస్తున్న ఏఎస్ఐ మేకల రాములు, హెడ్ కానిస్టేబుల్ నాగయ్య ప్రమాదాన్ని పసికట్టి, గ్రామస్తుల సహకారంతో డ్రైవర్ను రక్షించినట్లు తెలిపారు. అదేవిధంగా డీసీఎం వ్యాన్ లో ఉన్న పశువులను హైదరాబాద్ గోశాలకు తరలించారు.
గాయపడిన పశువులకు ప్రాథమిక చికిత్స నిర్వహించి స్థానిక దేవాలయ పూజారి పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం, ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా పశువులను అక్రమ రవాణా చేయడం లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
LATEST UPDATE :
-
KTR : ఏం.. పీక్కుంటారో పీక్కోండి.. నీ బాంబులకు భయపడలేదు..!
-
Suryapet : అభివృద్ధి, మెరుగైన జీవితాల కోసం.. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపు..!
-
Viral Video : లవ్ రెడ్డి సినిమా చూసి ప్రేక్షకురాలు ఎమోషన్.. నటుడు NT రామస్వామి పై థియేటర్ లోనే మహిళ దాడి.. ( వీడియో)
-
TG News : కొండ సురేఖ వ్యాఖ్యలపై కోర్టు సీరియస్..!









