Suryapet : శ్రీనిధిలో భారీగా అవకతవకలు.. రూ.40 లక్షల పక్కదారి..!
Suryapet : శ్రీనిధిలో భారీగా అవకతవకలు.. రూ.40 లక్షల పక్కదారి..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి సంఘబంధంలో భారీగా అవకతవకులు జరిగాయని మహిళలు ఆరోపించారు. రుణాలు తీసుకొని చెల్లించిన తమ రెక్కల కష్టాన్ని విబికె సొంతానికి వాడుకున్నారని మండి పడ్డారు. మున్సిపాలిటీలో ఇటీవల చేసిన ఆడిట్లో రెండు సంఘ బంధాల్లో సుమారు 40 లక్షలు చెల్లించాల్సి ఉందని అధికారులు తేల్చినట్లు మహిళలు పేర్కొన్నారు.
ఈ మొత్తాన్ని చెల్లిస్తామని విబికేలు కొట్ల మంజుల, బోడ సున్నిత లు అధికారుల ఎదుట సంతకం చేసి ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో నిధులు వాడుకోకపోతే రెండు మూడు రోజుల్లో ఎందుకు చెల్లిస్తామని ఒప్పుకున్నారని మహిళలు బుదవారం గ్రామంలో జరిగిన విచారణ లో నిలదీశారు. ఈ సందర్భంగా విచారణలో పాల్గొన్న వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాసును విబికే మంజుల అత్త బుచ్చమ్మ ఇష్టానుసారంగా దూషించడం వివాదాస్పదంగా మారింది.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ :
సంఘ బంధం నిధుల పక్కదారి పట్టాయన్న ఆరోపణలతో చేస్తున్న విచారణలో పాల్గొన్న కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాసును వివికె అత్త కోట్ల బుచ్చమ్మ మహిళల సమక్షంలో దూషణలకు దిగడంతో గందరగోళం నెలకొంది. అన్ని వర్గాల నాయకులు గ్రామంలో ప్రతినిద్యం వహించారాని, అధికారులు పిలిచిన కార్యక్రమంలో పాల్గొన్న తనను అవమానపరిచారని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. ఈ విషయమై న్యాయం కరిగే వరకు పోరాడుతానని చెప్పారు. అనంతరం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన వ్రాతపూర్వక ఫిర్యాదు చేశారు.
లెక్క అడిగితే బూతులే :
సమభావన సంఘాలకు సంబంధించిన సంఘబంధం లెక్కలను విబికే మంజులను ప్రశ్నిస్తే వివికె అత్త బుచ్చమ్మ బూతుల వర్షం కురిపిస్తుందని గ్రామ మహిళలు ఆరోపిస్తున్నారు. గత 12 ఏళ్లుగా విబికే గా కొనసాగుతూ అనేక అక్రమాలకు పాల్పడిందని తెలిపారు. మహిళా సంఘాల రుణాలకు సంబంధించి ఆమెకు రూ 2000 ముందే చెల్లించాలని లేకుంటే రుణం మంజూరు చేయించాదని చెప్పారు.
అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సైతం అత్త కోడలు పెత్తనం చేస్తూ భారీగా దండుకుంటున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సంఘబంధం రుణాలపై న్యాయపరంగా విచారణ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు.
MOST READ :
-
Miryalguda : వీళ్లు మామూలోళ్లు కాదు.. రెండేళ్లుగా.. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో చోరీలు.. అరెస్టు చేసిన పోలీసులు..!
-
Viral Video : స్కానింగ్ మిషన్ లోకెళ్లినా.. ఇదేంది సామీ.. తగ్గేదే లేదంటున్న పెద్దాయన.. (వీడియో)
-
Gold Price : గోల్డెన్ డేస్.. దీపావళికి మరోసారి షాక్, తులం బంగారం ధర ఎంతంటే..!
-
Employees : మేం లంచం తీసుకోం.. ఉద్యోగులు వినూత్న కార్యక్రమం..!









