TOP STORIESBreaking Newsరాజకీయం

TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..!

TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగిసింది. సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. కాగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ బీసీ కుల గణన అనంతరం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా వెల్లడించారు. 2025 జనవరిలో సంక్రాంతి వరకు కొత్త సర్పంచులు వస్తారని ఆయన పేర్కొన్నారు. అంటే 2024 డిసెంబర్ లోనే గ్రామపంచాయతీ సర్పంచులకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి. దాంతో గ్రామాలలో పట్టు సాధించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ చేసేందుకు సిద్ధమైంది. ఏది ఏమైనా డిసెంబర్ నెలాఖరులోగా సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

MOST READ : 

మరిన్ని వార్తలు