Nalgonda : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ..!
Nalgonda : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ..!
నల్లగొండ, మన సాక్షి :
ఈ వాన కాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి సందేహం లేకుండా తీసుకురావాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ,కమిషనర్ డిఎస్. చౌహన్ కోరారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, తాలు, తరుగు, తేమ వంటివి లేకుండా తెస్తే తక్షణమే కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయడమే కాకుండా మూడు, నాలుగు రోజుల్లో ధాన్యం అమ్మిన డబ్బులు సైతం జమ చేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 143 మెట్రిక్ టన్నుల దాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల సన్నదానం రానుందని ,తెలంగాణ సన్నధాన్యానికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉందని, తెలంగాణ బియ్యానికి ఒక బ్రాండ్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడు, ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం సన్నబియాన్ని తినేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగానే సన్న రకాలపై 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల 80 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్న ప్రజలకు సన్నబియ్యం సప్లై చేసేందుకు నిర్ణయించడం జరిగిందని ,ఇలాంటి విధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో లేదని తెలిపారు .ఇందుకోసం అధికారులు ,సెంటర్ల ఇన్చార్జీలు అంకితభావంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, ఇందుకు మిల్లర్లు, రైతులు సహకరించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం విజయవంతమైనప్పుడే రైతులు, ప్రజలు, మిల్లర్లు అందరూ సంతోష పడతారని తెలిపారు. రాష్ట్రంలో పండించిన సన్నవడ్లు రాష్ట్ర వినియోగాలకు ఉపయోగిస్తామని, మొత్తం 36 లక్షల టన్నుల సన్న ధాన్యం రాష్ట్ర ప్రజలకు అవసరమని, మనం పండిస్తున్న 80 లక్షల మెట్రిక్ టన్నులలో కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినా రాష్ట్ర అవసరాలు తీరుతాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతున్నదని, రైతులకు చెల్లింపులు సైతం వెంటనే చేస్తున్నామని, అందువల్ల రైతులు దళారీల మాటలు నమ్మి మోసపోయి ప్రైవేటు వ్యక్తులకు దాన్యం అమ్మవద్దని కోరారు.
రాష్ట్రంలో 7000 కేంద్రాలు ఉన్నాయని, సన్న, దొడ్డు రకాలకు వేరువేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నల్గొండ జిల్లాలో మొత్తం 340 కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ఇందులో 80 సన్న ధాన్యం కోసం ప్రారంభించడం జరిగిందని ,ఇప్పటివరకు 15,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఖరీదు చేయడం జరిగిందని, ఈ నెలలోనే ఎక్కువగా ధాన్యం వస్తుందని, రైతులు ధాన్యానికి సంబంధించి ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని ఆయన వెల్లడించారు.
రైతులు పూర్తి నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని, ఎక్కడైనా తూకంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు .నల్గొండ జిల్లాలో 10 అడ్వాన్సుడ్ క్లీనర్లు, డ్రయర్లు ఏర్పాటు చేయమని తెలిపామని. రాష్ట్రవ్యాప్తంగా 100 హై స్పీడ్ డ్రయర్లు సైతం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తెలంగాణ రైస్ కు ఒక బ్రాండ్ తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ధరించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ ,డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం హరీష్, ఆర్ డి ఓ రెడ్డి, డి సి ఓ పత్య నాయక్ , పిఎసిఎస్ అధ్యక్షులు నాగరత్నం రాజు ,తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ రైతులతో ముఖాముఖి మాట్లాడి ఎన్ని రోజుల క్రితం ధాన్యం తెచ్చారని? ఎంత తెచ్చారని?తేమ శాతం ఎలా ఉందని అడగడమే కాకుండా తనిఖీ చేశారు.
MOST READ :
-
Viral Video : అమెరికాలో పీఠం ఎక్కేది ఎవరో తేలిపోయింది.. హిప్పో జోస్యం.. (వీడియో వైరల్)
-
CM Revanth : స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. పుట్టిన రోజు నుంచి పాదయాత్ర..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు మార్గదర్శకాలు.. మీరు అర్హులేనా.. పంపిణీ ఎప్పటి నుంచంటే..!
-
Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!










