District collector : వారం రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..!
District collector : వారం రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి
పెండింగ్ లో ఉన్న LRS దరఖాస్తులను వారం రోజుల లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షఅధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ అరుణ శ్రీ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఎల్ 1 లాగిన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, పెండింగ్ ఉన్న దరఖాస్తులను వారం రోజుల లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రెండవ స్థాయి లాగిన్ ఎల్ 2లో ఉన్న దరఖాస్తులను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. స్క్రూటినీ పూర్తి చేసుకున్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులకు క్రమబద్ధీకరణ ఫీజు వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేసి వారిని ఫాలో అప్ చేస్తూ వేగవంతంగా ప్రభుత్వానికి క్రమబద్ధీకరణ రుసుము చెల్లించేలా చూడాలని, రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్ లను పంపిణీ చేయాలని
కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, డి . ఎల్ .పి. ఓ.లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ..!
-
Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!
-
Viral Video : అమెరికాలో పీఠం ఎక్కేది ఎవరో తేలిపోయింది.. హిప్పో జోస్యం.. (వీడియో వైరల్)
-
Gold Price : పసిడి ప్రియుల్లో ఆనందం.. పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ధర..!









