Gold Price : పసిడి భారీగా తగ్గింది.. కొనుగోలుదారులకు మంచి తరుణం..!
Gold Price : పసిడి భారీగా తగ్గింది.. కొనుగోలుదారులకు మంచి తరుణం..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకు బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులకు ఆనందం కలుగుతుంది. కార్తీక మాసం మంచి రోజుల్లో బంగారం కొనుగోలుకు ఇదే మంచి తరుణం అని బంగారం ప్రియులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాదులో బంగారం మార్కెట్ కిటకిటలాడుతోంది.
నవంబర్ 11వ తేదీన 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం 6000 రూపాయలు తగ్గింది. నవంబర్ 10వ తేదీన 100 గ్రాములకు 7,93,600 రూపాయల ధర ఉండగా నవంబర్ 11వ తేదీన 7,87,600 రూపాయల ధర ఉంది.
22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు రూ. 5500 తగ్గింది. నవంబర్ 10వ తేదీన 7,27,500 రూపాయల ధర ఉండగా నవంబర్ 11వ తేదీన 7,22,000 రూపాయల ధర ఉంది.
బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాలలో కూడా కొనసాగుతున్నాయి.
హైదరాబాదులో బంగారం ధరలు (November 11)
24 క్యారెట్స్ :
ఒక గ్రామం కు 7876 రూపాయలు
8 గ్రాములకు 63,008 రూపాయలు
10 గ్రాములకు 78,760 రూపాయలు
100 గ్రాములకు7,87,600 రూపాయలు
22 క్యారెట్స్ :
ఒక గ్రాముకు 7220 రూపాయలు
8 గ్రాములకు 57,760 రూపాయలు
10 గ్రాములకు 72, 200 రూపాయలు
100 గ్రాములకు 72,200 రూపాయలుగా ఉంది.
MOST READ :
-
RRC : రాత పరీక్ష లేకుండా టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. 5647 ఖాళీల భర్తీ..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. కఠినమైన నిబంధనలు..!
-
Gold Price : బంగారం ప్రియులకు గోల్డెన్ డేస్.. తులం బంగారం ఎంతంటే..!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కవల సోదరుడు ఉన్నాడని మీకు తెలుసా.. ఐతే తెలుసుకో..!









