Breaking NewsTOP STORIEStravelజిల్లా వార్తలునల్గొండ

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారికి ప్రత్యేక రాయితీ..!

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారికి ప్రత్యేక రాయితీ..!

దేవరకొండ, మనసాక్షి :

దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలాధారులకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకుంటే ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు తెలిపారు. శనివారం దేవరకొండ లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో గురుస్వాములతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శబరిమలకు బస్సులు బుక్ చేసుకున్న వారికి గత సంవత్సరం కిలోమీటర్ కు రూ.65 ఉండగా ఈ సంవత్సరం రూ.59 కి తగ్గించినట్లు తెలిపారు. అదేవిధంగా టోల్ చార్జెస్ కూడా ఆర్టీసీ సంస్థ భరిస్తుందన్నారు. గత సంవత్సరం కన్నా మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు.

ఆర్టీసీ బస్సులను అయ్యప్ప స్వాములు బుక్ చేసుకొని సహకరించాలని కోరారు. పూర్తి వివరాలకు 7382833031, 7382833070 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు, ఉద్యోగులు, స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు