District collector : ప్రజా పాలనా ప్రజా విజయోత్సవాలు విజయవంతం చేయాలి..!
District collector : ప్రజా పాలనా ప్రజా విజయోత్సవాలు విజయవంతం చేయాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రాష్ట్రంలోప్రజా పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రం లోని అంజనా గార్డెన్స్ లో నేడు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఇందులో భాగంగా సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ ఆద్వర్యం లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై రూపొందించిన సంగీత, నాటక, నృత్య, స్కిట్ ను ప్రదర్శించనున్నారని ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి నేటి కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంజనా గార్డెన్స్ లో వేదిక, సౌండ్ అండ్ లైటింగ్, కళాకారులకు బస, భోజన వసతి ఏర్పాటు చేయాలని, కార్యక్రమానికి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఈ నెల19 నుంచి డిసెంబర్ 7
వరకు ప్రజాపాలన కళా యాత్ర చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
ప్రతి రోజూ జిల్లాలో 3 గ్రామాల్లోప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, ఏడాది కాలం లో అమలు చేసిన సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక కళాకారులు ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. మండలం, గ్రామాల్లో కళాకారులు పర్యటించే సమయంలో ఎం.పి.డి. ఓ.లు,ఎం.పి. ఓ లు,పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఏర్పాట్లు చేయాలని డి.పి. ఓ ను ఆదేశించారు.
ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏవో జయసుధ, డీ.పి.అర్. ఓ ఎంఏ రషీద్, డి.అర్.డీ ఓ మొగులప్ప, డీఎస్పీ నల్లపు లింగయ్య, డిపిఓ కృష్ణ, సిపిఓ యోగానంద్,డి ఈ ఓ అబ్దుల్ ఘని, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డి, జి సి డి ఓ పద్మ నళిని, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Viral Video : రీల్స్ పిచ్చి.. ప్రమాదం కూడా గుర్తించని మహిళ.. (వీడియో)
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
-
జిమ్ లో ఇలా చేస్తావా..? వైరల్ అవుతున్న వీడియో.. తీవ్ర విమర్శలు..!
-
Toll Tax : ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!









