Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బంది సస్పెన్షన్..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బంది సస్పెన్షన్..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :

ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ముత్తారం ఎంపీడీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిబ్బంది విధులకు గైర్హజరవడం గమనించారు.

బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించగా ఆ సిబ్బంది అనుమతి లేకుండా చాలా రోజులుగా విధులకు ఉమ్మా కొట్టడం గమనించిన కలెక్టర్ , పలుమార్లు ఆ సిబ్బందికి మెమోలు జారీ చేసినప్పటికీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సస్పెండ్ చేశారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముత్తారం మండలం ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎండి.ఖాదర్ పాషా, జూనియర్ అసిస్టెంట్ వి.నరేష్, కార్యాలయ సభ ఆర్డినేట్ ఎండి.ఫయాజ్, ఎంపీడీవో కార్యాలయలో సిబ్బంది గా పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు సురేందర్, ఫయాజ్ , జైపాల్ లను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు