Cm Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం..!
Cm Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి లేకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరం తో పాటు జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో సైతం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ డ్రగ్స్, గంజాయి పట్టి వేస్తున్న విషయం తెలిసిందే.
యువత గంజాయి బారిన పడకుండా పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. మరింత కట్టుదిట్టంగా డ్రగ్స్ కేసుల దర్యాప్తులో పనిచేసేందుకు గాను నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
అందులో భాగంగానే వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. లా అండ్ ఆర్డర్ పోలీసులు రిజిస్టర్ చేసే కేసులను కూడా నార్కోటిక్స్ పోలీసులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
ఆ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద నమోదు కాబడిన కేసులను వారు దర్యాప్తు చేస్తారు.
అయితే ఈ పోలీస్ స్టేషన్లలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించే అవకాశాలు ఉన్నాయి. గంజాయి డ్రగ్స్ కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వారిని ఈ స్టేషన్లో నియమించే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా రాష్ట్రంలో యువత పెడదారి పట్టకుండా డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి భారీగా దిగమవుతవుతున్న గంజాయి వివిధ రూపాలలో యువత, చిన్న పిల్లలు, కళాశాల విద్యార్థులు సైతం బానిసలు అవుతున్నట్లుగా ప్రభుత్వం దీనిని గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టేందుకు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
MOST READ :
-
Ration Cards : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!
-
Cm Revanth Reddy : అందరికీ రుణమాఫీ.. ఎవరి మాటలు నమ్మొద్దు.. విడుదల అప్పుడే.. రేవంత్ కీలక ప్రకటన..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బంది సస్పెన్షన్..!









