Miryalaguda : మున్సిపల్ సమావేశం బహిష్కరించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు.. అవినీతి చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!
Miryalaguda : మున్సిపల్ సమావేశం బహిష్కరించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు.. అవినీతి చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు బహిష్కరించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
కాగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ గత 15 సంవత్సరాలుగా మున్సిపల్ ఖజానా దోచుకుంటున్నాడని అన్నారు.
ఎన్నో అవినీతి పనులు చేసి చైర్మన్ ఈరోజు డ్రామాలాడుతున్నట్లు తీవ్రంగా విమర్శించారు. దొంగనే దొంగ దొంగ అని అరవడం ఏంటని వారు ప్రశ్నించారు. తానే అక్రమ కట్టడాలకు పాల్పడి గత కొన్ని సంవత్సరాలుగా కమిషన్లు తింటూ ఇప్పుడు ఆర్టీఐ లో ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కండువా మార్చి మళ్లీ దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ని కాంగ్రెస్ పార్టీలో బహిష్కరించడంతో కొత్త డ్రామా ని తెరపైకి తెచ్చి ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు.
మునిసిపల్ చైర్మన్ కమిషన్లు కావలసిన ప్రతిసారి మున్సిపల్ కాంప్లెక్స్ లో టెండర్స్ అంటూ షాప్స్ వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతుందని వారు ఆరోపించారు. ఇలాంటి అవినీతిపరులను కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదంటూ.. అవినీతి చైర్మన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి బాలు, ముదిరెడ్డి నర్సిరెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, మొల్లాల అమృత రెడ్డి, శాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, మంత్రాల రుణాల్ రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, బంటు లక్ష్మీనారాయణ, రవి నాయక్, బలుగూరి శ్రీనివాస్, బండి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!
-
Ration Cards : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈవి పాలసీ, వారందరికీ ఉచితం..!
-
Gold Price : పసిడికి మరోసారి రెక్కలు.. తులం బంగారం ధర ఎంతంటే..!











