ACB : ఇంటి నెంబర్ కేటాయించేందుకు రూ.30 వేలు డిమాండ్.. చివరికి ఏం జరిగిందంటే..!
ACB : ఇంటి నెంబర్ కేటాయించేందుకు రూ.30 వేలు డిమాండ్.. చివరికి ఏం జరిగిందంటే..!
మన సాక్షి :
ఇంటి నెంబర్ కేటాయించడం కోసం 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. మెదక్ జోనల్ ఏసీబీ డిఎస్పి సుదర్శన్ వెల్లడించిన వివరాల ప్రకారం..
గతంలో ఐలాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సచిన్ కుమార్ ఆ గ్రామంలో స్వర్ణలత అనే మహిళ ఇంటికి ఇంటి నెంబర్ కేటాయించడం కోసం 30 వేల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే బాధితురాలు భర్త మొదటి దఫాలో పదివేల రూపాయలు చెల్లించగా రెండో దఫాలు 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.
కాగా బాధితురాలి భర్త మల్లేష్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. కాగా సెప్టెంబర్ 26వ తేదీన అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర హోటల్ కు పంచాయతీ కార్యదర్శి పిలిచి భేరసారాలు చేయగా రూ. 15,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.
ఏసీబీ అధికారుల సూచన మేరకు మొత్తం వీడియో తీసిన బాధితుడు అధికారులకు వీడియో అందజేశాడు. కాగా గురువారం ఏసీబీ అధికారులు వీడియో పరిశీలించి లంచం తీసుకున్నట్లుగా నిర్ధారణ కావడంతో పంచాయతీ కార్యదర్శి సచిన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన సదాశివపేట మండలం ఆత్మకూరులో విధులు నిర్వహిస్తున్నాడు.
MOST READ :
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!
-
Ration Cards : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!
-
Viral Video : అమ్మాయికి మెసేజ్ చేశాడని.. ముగ్గురు యువకుల పాశవిక దాడి.. (వీడియో)
-
Cm Revanth Reddy : అందరికీ రుణమాఫీ.. ఎవరి మాటలు నమ్మొద్దు.. విడుదల అప్పుడే.. రేవంత్ కీలక ప్రకటన..!
-
Gold Price : వరుసగా మూడో రోజు.. చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!









