Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్లగొండ డీఈవో బిక్షపతి రాసలీలలు.. భార్య ఆందోళన..!

Nalgonda : నల్లగొండ డీఈవో బిక్షపతి రాసలీలలు.. భార్య ఆందోళన..!

నల్లగొండ, మన సాక్షి.

తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త డిఇఓ బిక్షపతి రెండో వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ మొదటి భార్య మాధవి గురువారం నల్లగొండ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న డి ఈ ఓ బిక్షపతి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది.

మొదటి భార్య బిక్షపతి ఇంటిముందు ఆందోళన చేయడం ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆందోళన చేపట్టిన మొదటి భార్య మాధవి మాట్లాడుతూ 14 సంవత్సరాల క్రితం బిక్షపతితో తనకు వివాహం జరిగిందని చెప్పారు.

నెల రోజుల పాటు తనతో కాపురం చేసిన బిక్షపతి తనపై తప్పుడు ఆరోపణలు చేసి దూరంగా ఉంటున్నాడని చెప్పారు. తనకు జరిగిన అన్యాయం పై కోర్టును ఆశ్రయించడంతో ఇప్పటివరకు కేసు కోర్టులోనే నడుస్తుందని చెప్పారు.

కేసు కోర్టులో నడుస్తున్న సమయంలోనే బిక్షపతి రెండో వివాహం చేసుకొని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడని ఆరోపించారు. తనకు తీరని అన్యాయం చేసిన బిక్షపతి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మొదటి భార్య మాధవి గురువారం నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నాగరాజు చెప్పారు. మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతామని ఆయన చెప్పారు.

MOST READ :

మరిన్ని వార్తలు