Runamafi : రుణమాఫీ అప్ డేట్.. రైతులకు లబ్ది చేకూర్చే విధంగా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలి..!
Runamafi : రుణమాఫీ అప్ డేట్.. రైతులకు లబ్ది చేకూర్చే విధంగా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ, ఎం.ఎస్.ఎం. ఈ. రంగాలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్ లో ఏర్పాటు చేసిన డిసిసి సమావేశానికి చైర్మన్ గా జిల్లా కలెక్టర్, కో కన్వీనర్ గా లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ వ్యవహరించారు.
ఈ సమావేశంలో వార్షిక ప్రణాళికాకు సంబంధించిన 2024–25 సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసానికి 1359.11 కోట్లతో త్రైమాసిక వృద్ధి ఇది వార్షిక ప్రణాళికలో 41.59 శాతం మరియు ఎస్. ఎం .ఈ సెగ్మెంట్ సంబందించి 96.66 కోట్లతో 38 .41 శాతం ప్రగతి , మరియు ప్రాదాన్యత రంగానికి 1211.01 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఎల్ డి. ఎం విజయ్ కుమార్ వెల్లడించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాదాన్యత రంగాలకు బ్యాంకర్లు అధిక రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే ఋణ మాఫీ పొందిన రైతులకు ఈ నెలాఖరులోగా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసి రైతులకు ఋణ మాఫీ లబ్ది చేకూర్చే విధంగా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్.బి.ఐ నుంచి బి.పల్లవి, నాబార్డు అధికారి షణ్ముఖ చారి , ఎస్.బి. ఐ.ఏజీఎం అనిల్ కుమార్, జిల్లాలోని అన్ని బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని వివిధ సమస్యలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో డిఆర్డిఓ మొగులప్ప మాట్లాడుతూ మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు , సోలోర్ ఎనర్జీ వంటి పథకాలను ప్రోత్స హిస్తున్నామని వారికి బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. జిఎండిఐసీ మహేష్ మాట్లాడుతూ పి.ఎం. విశ్వకర్మ కింద ట్రైనింగ్ తీసుకున్న లబ్దిదారులకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశం లో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Mana Sakshi Effect : మన సాక్షి కథనానికి స్పందన.. 119 అక్రమ ఇసుక తరలింపు వాహనాల పట్టివేత… జిల్లా కలెక్టర్..!
-
ACB : ఇంటి నెంబర్ కేటాయించేందుకు రూ.30 వేలు డిమాండ్.. చివరికి ఏం జరిగిందంటే..!
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!
-
Gold Price : పసిడికి మరోసారి రెక్కలు.. తులం బంగారం ధర ఎంతంటే..!









