TG News : తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు.. 3500 ఖాళీ పోస్టులు..!

TG News : తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు.. 3500 ఖాళీ పోస్టులు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ విద్యుత్ సంస్థలు టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) టిఎన్ఎస్పీడీసీఎల్ (TNSPDCL) లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఖాళీలకు త్వరలో నోటిఫికేషన్ వెలువలనున్నది. ఆయా శాఖలలో 3,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 1550 పోస్టులు జూనియర్ లైన్ మెన్ ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఆయా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టనున్నది. అందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జూనియర్ లైన్?మెన్ ఉద్యోగాలకు ఐటిఐ, మిగతా AE, AEE ఉద్యోగాలకు ఇంజనీరింగ్ డిప్లమా, డిగ్రీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు అర్హులుగా పరిగణించబడతారు.
18 నుండి 46 సంవత్సరాల వయసు మధ్య కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చును. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం, వేతనం :
తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందుకుగాను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. వారి వారి సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి. వాటితో పాటు జనరల్ నాలెడ్జి, ఇంగ్లీష్ నుండి కూడా ప్రశ్నలు వస్తాయి.
ఎంపికైన అభ్యర్థులకు 30,000 రూపాయల వేతనం నుంచి 50 వేల రూపాయల వేతనం వరకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి వేతనంతో పాటు అన్ని రకాల అలవెన్సులు వర్తిస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలో పదోన్నతుల కారణంగా ఈ ఉద్యోగాలకు అక్టోబర్ లో నోటిఫికేషన్ రావాల్సి ఉన్నప్పటికీ కొంత ఆలస్యమైంది. ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
MOST READ :
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు ఖరారు.. ఇక లబ్ధిదారుల ఎంపికే.. మీరు అర్హులేనా..!
-
Runamafi : రుణమాఫీ అప్ డేట్.. రైతులకు లబ్ది చేకూర్చే విధంగా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలి..!
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈవి పాలసీ, వారందరికీ ఉచితం..!
-
Nalgonda : నల్లగొండ డీఈవో బిక్షపతి రాసలీలలు.. భార్య ఆందోళన..!









