Breaking Newsతెలంగాణరాజకీయం

TG News : ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. హైకోర్టు సంచలన తీర్పు..!

TG News : ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. హైకోర్టు సంచలన తీర్పు..!

మనసాక్షి, హైదరాబాద్ :

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు భారీ ఊరట కలిగింది. గురువారం ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన శుక్రవారం హైకోర్టులో పిటిషన్ వేశారు.

కాగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారం రోజుల వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఏసీబీ దర్యాప్తును కొనసాగించవచ్చునని హైకోర్టు తెలియజేసింది. దాంతోపాటు ఈనెల 30వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 27వ తేదీ వరకు వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది.

MOST READ : 

మరిన్ని వార్తలు