Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణవిద్య

Gurukula : గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు..!

Gurukula : గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు..!

నేలకొండపల్లి, మన సాక్షి :

2025-26 విద్యా సంవత్సరం లోని గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని నేలకొండపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ యం. పద్మావతి సూచించారు. శనివారం తన చాంబర్ లోఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు.

నాణ్యమైన విద్య ను అందిస్తూ… వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ.. సవాళ్ల ను ఎదుర్కునేందుకు సిద్ధం చేసేందుకు గురుకులాలు ఉన్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాల లో 5 వ తరగతి లో ప్రవేశం కోరకు ఈ నెల 21 నుంచి ప్రిబవరి,1, 2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అభ్యర్థి కి బదులు వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 23 న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కోన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు