Breaking NewsTOP STORIESజాతీయం

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ డబ్బుల కోసం.. డిసెంబర్ 31 లోగా రైతులు రిజిస్ట్రీ చేసుకోవాల్సిందే..!

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ డబ్బుల కోసం.. డిసెంబర్ 31 లోగా రైతులు రిజిస్ట్రీ చేసుకోవాల్సిందే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతులకు ఇప్పటివరకు 18 విడతలుగా పెట్టుబడి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ప్రతి విడుతకు 2000 రూపాయల చొప్పున రైతులకు రైతులకు ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే 19వ విడత ఫిబ్రవరి మాసంలో విడుదల చేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం సిద్ధమైంది 19వ విడత డబ్బులు పొందడానికి కిసాన్ రిజిస్ట్రేషన్ పొందడం తప్పనిసరి. కిసాన్ రిజిస్ట్రేషన్ అగ్రి స్టాక్ సహాయంతో జరుగుతుంది. రైతులందరూ తమకిసాన్ రిజిస్ట్రీని డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తి చేసుకోవాల్సి ఉంది. రిజిస్ట్రీ చేసుకోకపోతే కిసాన్ నిధి ఆగిపోయే అవకాశం ఉంది.

రైతు రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ మాత్రమే అవసరం ఉంటుంది. రైతులకు ఇవ్వాల్సిన కిసాన్ నిధి కిసాన్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే అందజేస్తారు. కిసాన్ రిజిస్ట్రీ ద్వారా రైతులు పంటల బీమా ఉపశమనాన్ని పొందుతారు. కిసాన్ రిజిస్ట్రీ ద్వారా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, బ్యాంకు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు పై సులభంగా రాయితీలను కూడా పొందుతారు.

ప్రధాన ఉద్దేశం ఏంటంటే భూమి మోసాన్ని తగ్గించడం, ఒక్కొక్కరికి ఎంత భూమి ఉందో తెలుస్తుంది. దాంతో భూ తగాదాలను అరికట్టవచ్చును. భూమిపై ఉన్న సౌకర్యాలు రైతులకు కూడా సులభంగా అందుబాటులోకి వస్తాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు