TOP STORIESBreaking Newsజాతీయం

PM Kisan : PMKYతో రైతుల ఖాతాలలో రూ.6వేలు.. లబ్దిదారుల చెకింగ్.. కొత్ర ధరఖాస్తు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!

PM Kisan : PMKYతో రైతుల ఖాతాలలో రూ.6వేలు.. లబ్దిదారుల చెకింగ్.. కొత్ర ధరఖాస్తు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 6000 రూపాయలను బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుంది. మూడు విడతలుగా ఈ నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి.

ఇప్పటి వరకు 18 విడతలుగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలలో నిధులు జమ అయ్యాయి. ఇకపై ఫిబ్రవరి మాసంలో 19వ విడత డబ్బులు రైతుల ఖాతాలలో జమ కానున్నాయి. అయితే 19 విడత కిసాన్ డబ్బులు మీ ఖాతాలో పడతాయా.? లేదా..? అనే విషయాన్ని చెక్ చేసుకోవచ్చును.

19వ విడత తేదీ ఫిక్స్ :

ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా 19వ విడత రైతులకు ఆర్థిక సహాయం అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతుల ఖాతాలలో నేరుగా 2000 రూపాయలను జమ చేయనున్నారు. 2025 ఫిబ్రవరి మాసంలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి.

లబ్ధిదారులు ఇలా చెక్ చేసుకోవచ్చును :

  • ప్రధానమంత్రి కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in సందర్శించాలి.

  • హోం పేజీలో బెనిఫిషరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి.

  • మీ వివరాలు నమోదు చేయాలి.

  • మీ ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్ లేదా మొబైల్ నెంబర్ సబ్మిట్ చేయాలి.

  • దాంతో మీ స్టేటస్ కనిపిస్తుంది.

కొత్త రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి :

ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంకు కొత్త రైతులు ఇలా దరఖాస్తు చేసుకోవచ్చును.

ప్రధానమంత్రి కిసాన్ కోసం కొత్త రైతులు ఆన్ లైన్ లో లేదా కామన్ సర్వీస్ సెంటర్లు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.

  • అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ https://pmkisan.gov.in లోకి వెళ్ళాలి.

  • న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి.

  • ఆధార్ నెంబర్, రాష్ట్రం, జిల్లా, వ్యక్తిగత బ్యాంకు సమాచారం వివరాలు సబ్మిట్ చేయాలి.

  • ఫారం సమర్పించి ఓ కాపీని సేవ్ చేసుకోవాలి.

  • సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఆమోదానికి ముందు స్థానిక అధికారులచే ధృవీకరించబడుతుంది.

MOST READ : 

Gold Price : నిన్న తగ్గింది.. మళ్లీ పెరిగింది.. నేడు బంగారం ధరలు..!

New Scheme : తెలంగాణ మహిళలకు అదిరిపోయే పథకం.. ప్రతి మహిళకు 10 లక్షలు.. వివరాలు ఇవే..!

Cm RevanthReddy : సంక్రాంతికి వస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి..!

Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!

మరిన్ని వార్తలు