Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
TGB : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో మరో బ్యాంకు విలీనం.. కస్టమర్లు తెలుసుకోవాలి..!
TGB : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో మరో బ్యాంకు విలీనం.. కస్టమర్లు తెలుసుకోవాలి..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
భారత ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణలో ఉన్న APGVB శాఖలు 01.01.25 నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో విలీనం కానున్నాయని శంకర్‌పల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ చాణిక్య రెడ్డి తెలిపారు.
మేనేజర్ మాట్లాడుతూ ఈ కార్యాచరణ కారణంగా బ్రాంచ్ బ్యాంకింగ్, ATM, UPI, మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP మొదలైన అన్ని బ్యాంకింగ్ సేవలు 28.12.24 నుండి 31.12.24 వరకు TGB లో అందుబాటులో ఉండవు.
అత్యవసర అవసరాల కోసం ఖాతాదారులు రూ.5,000 వరకు నగదు పొందేందుకు తమ బ్రాంచ్ని 30.12.24 మరియు 31.12.24 తేదీలలో సందర్శించవచ్చు. మరిన్ని మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800202725 కు కాల్ చేయండని కోరారు. అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలియజేశారు.
MOST READ :.









