తెలంగాణBreaking Newsవ్యవసాయంసంక్షేమం

Indiramma Bharosa : భూమిలేని రైతు కూలీలకు రూ.12 వేలు.. పంపిణీ ఎలా.. మీరు అర్హులేనా..!

Indiramma Bharosa : భూమిలేని రైతు కూలీలకు రూ.12 వేలు.. పంపిణీ ఎలా.. మీరు అర్హులేనా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకాన్ని అమలు చేయనున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలను ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 12వేల రూపాయలను రైతులకు అందజేయనున్నారు.

అదేవిధంగా భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏడాదికి 12 వేల రూపాయలను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గా నామకరణం చేశారు. రాష్ట్రంలో తాను పాదయాత్ర చేసిన సమయంలో కౌలు రైతుల కష్టాలు తమ దృష్టికి వచ్చాయని అందుకే భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి 12,000 ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పై రాష్ట్రవ్యాప్తంగా రైతులలో చర్చ కొనసాగుతుంది. అయితే ఈ పథకాన్ని ఏ విధంగా ఇస్తారు..? ఏ ప్రాతిపదికన రైతులకు డబ్బులు అందజేస్తారు..? అనేది చర్చనీయాంశంగా మారింది. కౌలు రైతులు, భూమిలేని రైతు కూలీలకు 12 వేల రూపాయలను అందజేస్తే అసలు భూములు ఉన్న రైతులకు రైతు భరోసా వస్తుందా..? రాదా..? అనేది తర్జనభజన పడుతున్నారు.

ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని రైతు కూలీలకు అందజేయాలని నిర్ణయించినందునా ఏ ప్రాతిపదికన ఇస్తారనే విషయంపై చర్చ సాగుతుంది. అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులై ఉండి కూలికి వెళ్తున్న రైతులు ఉంటే ఆ వారిని గుర్తించి ఆ ప్రాతిపదికన ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా అందజేశారని సమాచారం. ఏది ఏమైనా రైతు కూలీలకు సైతం ఏడాదికి 12 సహాయం అందనున్నది.

MOST READ :

మరిన్ని వార్తలు