Breaking Newsరాజకీయంవైద్యంసినిమాహైదరాబాద్

ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలలో సీఎం పేరు మర్చిపోయిన యాంకర్..!

ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలలో సీఎం పేరు మర్చిపోయిన యాంకర్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కు బదులు కిరణ్ కుమార్ పేరు ఉచ్చరించారు. ఈ సంఘటన హైదరాబాదులోని హైటెక్స్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హోస్ట్ గా వ్యవహరిస్తున్న సినీ నటుడు బాలాదిత్య ఆహ్వానించారు.

అప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు అంటూ ఉచ్చరించారు. యాంకర్ నోటి నుంచి సీఎం కిరణ్ కుమార్ అని రావడంతో సభ కింద ఉన్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. దాంతో తాను చేసిన తప్పును యాంకర్ గ్రహించాడు. ఆ తర్వాత వెంటనే తప్పును గ్రహించి సారీ చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఉచ్చరించారు.

 

మరిన్ని వార్తలు