TOP STORIESBreaking Newsజాతీయం

UPI : ఫోన్ పే, గూగుల్ పే లకు క్రెడిట్ కార్డు లింక్ చేసి వాడుకోవచ్చు.. ఎలా అంటే..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే లకు క్రెడిట్ కార్డు లింక్ చేసి వాడుకోవచ్చు.. ఎలా అంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

యూపీఐ పేమెంట్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు యూపీఐ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు లావాదేవీలు చేపడుతున్నారు. తక్కువ అమౌంట్ తో పాటు లక్షల్లో కూడా యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. యూపిఐ పాపులర్ కావడంతో క్రెడిట్ కార్డు వాడే వారు కూడా దీనినే ఎంపిక చేసుకొని వాడుతున్నారు. అయితే మీ యుపిఐ కి క్రెడిట్ కార్డు ని ఎలా లింక్ చేయాలో..? లావాదేవీలు ఎలా పొందాలో తెలుసుకుందాం…

మీరు ఉపయోగించే ఫోన్ పే, గూగుల్ పే, పేటియం ఇతర యూపీఐ యాప్ లలో ఓపెన్ చేయండి. యూపీఐ సెట్టింగ్ పై క్లిక్ చేయండి. దాంట్లో యూపీఐ లేదా పేమెంట్స్ సెక్షన్ లో ఈ ఆప్షన్ ఉంటుంది. పేరును లేదా క్రెడిట్ కార్డు ఎంపిక చేయండి. అక్కడ క్రెడిట్ కార్డు లేదా లింక్ క్రెడిట్ కార్డు అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయాలి.

ఇక్కడ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలి. మీ క్రెడిట్ కార్డు నెంబరు, పేరు, వ్యాలిడిటీ, సి వి వి కోడ్ నమోదు చేయాలి. మీరు క్రెడిట్ కార్డు లింక్ చేయడానికి ఓటిపి లేదా పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతో క్రెడిట్ కార్డు విజయవంతంగా లింకు అవుతుంది. అప్పటినుంచి మీ క్రెడిట్ కార్డును యూపిఐ పేమెంట్స్ ద్వారా ఉపయోగించుకోవచ్చును.

ఐడి ని క్రియేట్ చేయాలి :

మీ క్రెడిట్ కార్డు లింక్ చేసిన తర్వాత లావాదేవీల కోసం ఒక ప్రత్యేక ఐడిని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. యాప్ ప్రొఫైల్లోకి వెళ్లి యూపీఐ ఐడిని ఎంచుకోవాలి. ఎక్కడైనా, ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు కానీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు కానీ, లింక్ అయిన క్రెడిట్ కార్డును సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్స్ చేయవచ్చును.

అయితే వీసా, మాస్టర్ కార్డు, నెట్వర్క్ లకు ఇంకా ఈ అవకాశం రాలేదు. ఎస్బిఐ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ లతో సహా మరో 22 బ్యాంకులకు క్రెడిట్ కార్డు ఇంటిగ్రేషన్ అనుమతిస్తున్నాయి. యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డును ఉపయోగించి పేమెంట్స్ చేస్తే చార్జీలు అదనంగా ఏమి ఉండవు. ఎక్కువ రేంజ్ లో పేమెంట్ చేస్తే మీకు హెచ్చరికలు కూడా వస్తాయి. పేమెంట్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే డబ్బులు డెబిట్ అవుతాయి.

MOST READ ; 

మరిన్ని వార్తలు