Additional Collector : స్త్రీ నిధి బకాయిలను పూర్తిగా చెల్లించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!
Additional Collector : స్త్రీ నిధి బకాయిలను పూర్తిగా చెల్లించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :
స్త్రీ నిధి బకాయిలను పూర్తిగా చెల్లించి రుణాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ ఆధ్వర్యంలో మెప్మాలోని స్త్రీ నిధి లో అత్యల్ప ప్రగతి కలిగిన రిసోర్స్ పర్సన్ ను సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ మాట్లాడుతూ, మహిళా సమాఖ్యలలో దీర్ఘకాలంగా బకాయిలు ఉన్న కమ్యూనిటీ ఆర్గనైజర్స్, రిసోర్స్ పర్సన్ లను సమీక్ష చేసి బకాయిలు పూర్తిగా కట్టించాలని అన్నారు. సమీక్షకు హాజరు కాని రిసోర్స్ పర్సెన్స్ పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
రికవరీలలో అవకతవకలు జరిగితే క్రిమినల్ కేసులు పెట్టాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రతి ఒక్క సమాఖ్య, రిసోర్స్ పర్సన్ వారి బకాయిలను పూర్తిగా చెల్లించి స్త్రీ నిధి రుణాలు వినియోగించుకునేలా రుణ ప్రణాళికను తయారు చేసుకోవాలని అన్నారు.
మహిళా శక్తిలో భాగంగా లోన్ బీమా ప్రమాద బీమాలలో నమోదైన క్లేయిమ్ లను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. మహిళా శక్తిలో భాగంగా కొత్త యూనిట్ లను నెలకొల్పాలని అన్నారు. సంఘాలలో లేని సభ్యులను సంఘాలలో చేర్చి కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎ.ఓ.పి సంపత్, డి.ఎం.సీ డి సతీష్ బాబు, శ్రీనిధి రీజనల్ మేనేజర్లు, రిసోర్స్ పర్సన్స్ , తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Elections : తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఇది షెడ్యూల్..!
-
Penpahad : యూరియా సరఫరాకు చర్యలు.. మనసాక్షి కథనానికి స్పందించిన వ్యవసాయ అధికారి..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
Gold Price : బంగారం టాప్ గేర్.. ఒక్కరోజే రూ.9200.. లేటెస్ట్ అప్డేట్..!
-
Inter Exams : ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు.. పకడ్బందీగా నిర్వహించాలి..!









