తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్

Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలకు తేదీ ఖరారు అయింది. గ్రామాలలో సర్పంచ్ ల పాలన ముగిసి 2025 ఫిబ్రవరి 2వ తేదీతో సంవత్సర కాలం గడిచింది. ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.

అందుకుగాను రిజర్వేషన్ల ను ఖరారు చేయడానికి కులగణన నిర్వహించారు. కుల గణన రిపోర్టును కూడా మంత్రిమండలి ఉపసంఘానికి అందజేయడం జరిగింది. కాగా ఈనెల 4వ తేదీన కులగణన రిపోర్టును మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత 5వ తేదీన నిర్వహించే అసెంబ్లీలో కులగణన రిపోర్టును ఉంచి రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది.

కొత్తగా రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఫిబ్రవరి 15వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన ఎన్నికలు వస్తున్నాయి.. జాగ్రత్త అంటూ కార్యకర్తలకు సూచించారు. మంత్రి పొంగులేటి ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ చర్చ కొనసాగుతుంది.

కుల గణన నివేదిక పూర్తి కావడం వల్ల ప్రభుత్వం కూడా ఎన్నికలపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో గాని గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి అవుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజెపి పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

MOST READ ; 

  1. MLC Electron : వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. జిల్లా కలెక్టర్..!

  2. Gold Price : పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధర..!

  3. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్

  4. TG News : కుల గణన సర్వే రిపోర్ట్.. బీసీ జనాభా లెక్క తేలింది.. అధికారికంగా ప్రకటించిన కమిటీ..!

  5. Miryalaguda : నల్గొండ జిల్లాలో ఫేక్ రిపోర్టర్ల గుట్టు రట్టు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు.. పిడి యాక్ట్ నమోదు..!

మరిన్ని వార్తలు