Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం.. వేదింపులకు యువతి ఆత్మహత్య..!

Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం.. వేదింపులకు యువతి ఆత్మహత్య..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో విషాదకరమైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాణి అనే యువతీ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మిర్యాలగూడ లోని ఓ కిరాణా షాపులో వాణి పనిచేస్తుంది.

గత కొద్దీరోజులుగా అదే గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన వాణి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

MOST READ : 

  1. Nizamabad : దుబాయ్ లో గుండె పోటుతో నిజామాబాద్ జిల్లా వాసి మృతి..!

  2. రామసముద్రం ఎస్ఐగా రవికుమార్ బాధ్యతల స్వీకరణ..!

  3. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!

  4. Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు